Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kalvari Giripai Siluva

కల్వరి గిరిపై సిలువ

Kalvari Giripai Siluva

Verse
కల్వరి గిరిపై సిలువ భారం
భరించితివా ఓ నా ప్రభువా
నా పాపముకై నీ రక్తమును
సిలువ పైన అర్పించితివా‖ 2x ‖
Verse
దుష్టుండనై బల్లెము బూని
గ్రుచ్చితి తండ్రి ప్రక్కలోన‖ 2x ‖
కేక వేసి నీదు ప్రాణం
సిలువ పైన అర్పించితివా‖ 2x కల్వరి ‖
Verse
మూడు దినములు సమాధిలో
ముదము తోడ నిద్రించితివా‖ 2x ‖
నా రక్షణకి సజీవముతో
సమాధిన్ గెల్చి లేచిన తండ్రి‖ 2x కల్వరి ‖
Verse
ఆరోహణమై వాగ్ధానాత్మన్
సంఘము పైకి పంపించితివా‖ 2x ‖
నీ రాకడకై నిరీక్షణతో
నిందలనెల్ల భరించెదను‖ 2x కల్వరి ‖

Related Tags

SalvationGood FridaySacrifice