Verse
కల్వరి ప్రేమను తలంచునప్పుడు
కలుగుచున్నది దుఃఖం
ప్రభువా నీ శ్రమలను ధ్యానించునప్పుడు
పగులుచున్నది హృదయం‖ 2x ‖
గెత్సేమనే అను తోటలో
విలపించుచు ప్రార్ధించు ధ్వని‖ 2x ‖
నలువైపులా వినబడుచున్నది
పగులుచున్నది నా హృదయం
కలుగుచున్నది దుఃఖం
సిలువపై నలుగ గొట్టిననూ
అనేక నిందలు మోపిననూ‖ 2x ‖
ప్రేమతో వారిని మన్నించుటకై
ప్రార్ధించిన ప్రియ యేసు రాజా
మమ్మును నడిపించుము‖ కల్వరి ‖
మమ్మును నీవలె మార్చుటకై
నీ జీవమును ఇచ్చితివి‖ 2x ‖
నేలమట్టుకు తగ్గించుకొని
సమర్పించితివి కరములను
మమ్మును నడిపిపంచుము‖ కల్వరి ‖