Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kalvarigirilona Silvalo Shree Yesu Palu Ba

కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు పలు బ

Kalvarigirilona Silvalo Shree Yesu Palu Ba

Verse
కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు
పలు బాధలొందెను – ఘోరబాధలు పొందెను‖ 2x ‖
నీ కోసమే అది నా కోసమే‖ 2x ‖
Verse
ప్రతివానికి రూపు నిచ్చె
అతనికి రూపు లేదు‖ 2x ‖
పదివేలలో అతిప్రియుడు
పరిహాసములనొందినాడు‖ 2x ‖
Verse
వధ చేయబడు గొర్రెవలె
బదులేమీ పలుకలేదు‖ 2x ‖
దూషించు వారిని చూచి
దీవించి క్షమియించె చూడు‖ 2x ‖
Verse
సాతాను మరణమున్ గెల్చి
పాతాళ మందు గూల్చి‖ 2x ‖
సజీవుడై లేచినాడు
స్వర్గాన నిను చేర్చినాడు‖ 2x ‖

Related Tags

Good FridaySacrificeCrucifixion