Chorus
కల్వరిగిరిపై నా యేసయ్య
నాకొరకై నీప్రాణం పెట్టావయ్యా!
నీకెన్నిశ్రమలు కరుణామయా !
నీప్రేమకు సాటేది ఓనజరేయా !‖ 2x కల్వరిగిరిపై ‖
Verse
కాళ్ళకు మేకులు కొట్టిరా – తలపై ముళ్ళకిరీటమా
నేరమే ఏమిలేకనే – అయ్యో ఇంతటి ఘోరమా‖ 2x ‖
మా పాపభారం మోసావయ్యా
మాకొరకై సిలువ మరణమొందావయ్యా
నీకెన్నిశ్రమలు కరుణామయా !
నీప్రేమకు సాటేది ఓనజరేయా !‖ 2x కల్వరిగిరిపై ‖
Verse
తనువునే చీల్చి వేసిరా – రుథిరమే ఏరులైపారెనా
లోకమే ఏక మాయెనా – అయ్యో అంతటి ద్వేషమా‖ 2x ‖
మాపాపభారం మోసావయ్యా
మాకొరకై సిలువ మరణమొందావయ్యా
నీకెన్నిశ్రమలు కరుణామయా !
నీప్రేమకు సాటేది ఓనజరేయా !‖ 2x కల్వరిగిరిపై ‖