Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kalvariloni Sreshtuda Karuna Bharitha Simhama

కల్వరిలోని శ్రేష్టుడా కరుణా భరిత సింహమా

Kalvariloni Sreshtuda Karuna Bharitha Simhama

Chorus
కల్వరిలోని శ్రేష్టుడా - కరుణా భరిత సింహమా
కన్ను భ్రమించు ప్రభువా - నిలువలోని మిత్రుడా
Verse
స్తుతుకి పాత్రుండగువాడా - దూతలతో వెంచేయువాడా
సుదతి మరియ పుత్రుడా - సిలువలోని మిత్రుడా
Verse
పాపులకై వచ్చినవాడా - ప్రేమ గల్గిన రక్షకుడా
పాదములపై బడితిమి - సిలువలోని మిత్రుడా
Verse
దీవెనల నిచ్చుటకై - వసుధ కేతించినవాడా
నీవే సుంకరు లాప్తుడవు - సిలువలోని మిత్రుడా
Verse
అయిదు రొట్టెలు మరి రెండు - చేపలతో నైదు వేల
జనుల పోషించిన తండ్రి - సిలువలోని మిత్రుడా
Verse
నీళ్ళను రసముగ మార్చితివి - నీళ్ళ మీద నడిచితివి
మేళ్ళ నొసగు మా దాతా - సిలువలోని మిత్రుడా
Verse
రోగుల బాగుచేయువాడా - గ్రుడ్డికి నేత్రము లిచ్చితివి
అనాధుల నాయకుడా - సిలువలోని మిత్రుడా
Verse
హల్లెలూయా కర్హుడా - యెల్లరు కొనియాడు వాడా
బలముతో వచ్చువాడా - సిలువలోని మిత్రుడా

Related Tags

WorshipCrossJesus