Chorus
కల్వరిలోని శ్రేష్టుడా కరుణభరిత సింహమా
కన్ను భ్రమించు ప్రభువా సిలువలోని మిత్రుడా‖ కల్వరి ‖
Verse
స్తుతికి పాత్రుండగువాడా దూతలతో వేంచేయువాడా
సుదతి మరియ పుత్రుడా సిలువలోని మిత్రుడా‖ కల్వరి ‖
Verse
పాపులకై వచ్చినవాడా ప్రేమగల్గిన రక్షకుడా
పాదములపై బడితిమి సిలువలోనిమిత్రుడా‖ కల్వరి ‖
Verse
దీవెనలు నిచ్చువాడా వసుధ కేతెంచినవాడా
నీవే సుంకరలాప్తుడవు సిలువలోని మిత్రుడా‖ కల్వరి ‖
Verse
ఐదు రొట్టెలు మరి రెండు చేపలతో నైదువేల
జనుల పోషించిన తండ్రి సిలువలోని మిత్రుడా‖ కల్వరి ‖
Verse
నీళ్ళను రసముగ మార్చితివి నీళ్ళమీద నడచితివి
మేళ్ళనొసగు మాదాతా సిలువలోని మిత్రుడా‖ కల్వరి ‖
Verse
రోగులను బాగుచేయువాడా గ్రుడ్డికి నేత్రములిచ్చితివి
అనాధుల నాయకుడా సిలువలోని మిత్రుడా‖ కల్వరి ‖
Verse
హల్లెలూయ కర్హుడా యెల్లరు కొనియాడువాడా
బలముతో వచ్చు రాజా సిలువలోని మిత్రుడా‖ కల్వరి ‖