Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kalyaanam Kamaneeyam

కల్యాణం కమనీయం

Kalyaanam Kamaneeyam

Chorus
కల్యాణం కమనీయం
ఈ సమయం అతి మధురం‖ 2x ‖
దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా‖ 2x కల్యాణం ‖
Verse
ఏదెను వనమున యెహోవ దేవా
మొదటి వివాహము చేసితివే‖ 2x ‖
ఈ శుభ దినమున
నవ దంపతులను‖ 2x ‖
నీ దీవెనలతో నింపుమయ్యా‖ దేవా రావయ్యా ‖
Verse
కానా విందులో ఆక్కరనెరిగి
నీళ్ళను రసముగ మార్చితివే‖ 2x ‖
కష్టములలో నీవే
అండగా నుండి‖ 2x ‖
కొరతలు తీర్చి నడుపుమయ్యా‖ దేవా రావయ్యా ‖
Verse
బుద్ధియు జ్ఞానము సంపదలన్నియు
గుప్తమైయున్నవి నీయందే‖ 2x ‖
ఇహ పర సుఖములు
మెండుగ నొసగి‖ 2x ‖
ఇల వర్ధిల్లగ చేయుమయ్యా‖ దేవా రావయ్యా ‖

Related Tags

BlessingMarriageWedding