Verse
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం
దేవా రావయ్యా నీ దీవెన లీయవయ్యా
Verse
ఏదేను వనమున యెహూవా దేవా
మొదటి వివాహము చేసితివి
ఈ శుభదినమున నవదంపతులను
నీ దీవెనలతో నింపుమయ
Verse
కానా విందులో అక్కరలెరిగి
నీళ్ళను రసముగమార్చితివి
కష్టాలలో నీవు అండగా ఉండి
కొరతలు దీర్చి నడుపుమయా
Verse
బుద్ధియు జ్ణానము సర్వసంపదలు
గుప్తమైయున్నవి నీ యందే
ఇహపర సుఖములు నిండుగ నొసగి
నీ దీవెనలతో నింపుమయా