Verse
కళ్యాణమే వైభోగం – కమనీయ కాంతుల దీపం‖ 2x ‖
శ్రుతిలయల సుమధుర గీతం‖ 2x ‖
దైవ రచిత సుందర కావ్యం‖ కళ్యాణమే ‖
Verse
పరమ దైవమె ప్ర్రారంభించిన పరిశుద్ధమైన కార్యం‖ 2x ‖
నరుని మంచికై తన చేతులతో
ప్రభు రాసిచ్చిన పత్రం‖ కళ్యాణమే ‖
Verse
కీడు తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం
మోడుగానున్న జీవితాలు‖ 2x ‖
చిగురింపజేసే వసంతం‖ కళ్యాణమే ‖
Verse
దేవదూతలే తొంగిచూసేటి దృశ్యం
భావమధురిమలు పొంగజేసేటి‖ 2x ‖
కమనీయమైన చిత్రం‖ కళ్యాణమే ‖