Chorus
కళ్యాణమే వైబోగం కమనీయ కాంతుల దీపం
శృతిలయల సుమధురగీతం దైవరచిత సుందరకావ్యం
Verse
పరమదైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం
నరుని మంచికై తన చేతులతో ప్రభు రాసిచ్చిన పత్రం
Verse
కీడు తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం
మోడుగానున్న జీవితాలు చిగురింపజేసే వసంతం
Verse
దేవదూతలే తొంగిచూసేటి రమణీయమైన దృశ్యం
భావమధురిమలు పొంగజేసేటి కమనీయమైన చత్రం