Verse
కమనీయమైన నీ ప్రేమలోన
నే నిలువనా నా యేసయ్యా
Verse
కమనీయమైన నీ ప్రేమలోన
నే నిలువనా నా యేసయ్యా
తీయని నీ పలుకలలోన‖ 2x తీయ ‖
నే కరిగిపోనా నా యేసయ్యా‖ 2x ‖
నా హృదిలో కొలువైన నిన్నే
సేవించనా/సేవించెదా నా యేసయ్యా‖ 2x ‖
Verse
విస్తారమైన ఘన కీర్తి కన్నా
కోరదగినది నీ నామం
జుంటె తేనె ధారల కన్నా
మధురమైనది నీ నామం‖ 2x ‖
సమర్పణతో నీ సన్నిధిని చేరి
నిత్యము నిన్నే ఆరాధించనా‖ 2x కమనీయమైన ‖
Verse
వేసారిపోయిన నా బ్రతుకులో
వెలుగైన నిన్నే కొనియాడనా‖ 2x ‖
కన్నీటితో నీ పాదములు కడిగి
మనసారా నిన్నే పూజించనా‖ 2x ‖
నీ కృపలో గతమును వీడి
మరలా నీలో చిగురించనా‖ 2x కమనీయమైన ‖