Chorus
కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్య
కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్య
తీయనీ నీ పలుకలలోన నే కరిగిపోనా నా యేసయ్య
కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్య
తియ తీయనీ నీ పలుకలలోన నే కరిగిపోనా నా యేసయ్య
నా హృదిలో కొలువైన నిన్నే సేవించనా నా యేసయ్య
నా హృదిలో కొలువైన నిన్నే సేవించెదా నా యేసయ్య
Verse
విస్తారమైన ఘన కీర్తి కన్నా కోరదగినది నీ నామం
జుంటె తేనె ధారల కన్నా మధురమైనది నీ నామం
విస్తారమైన ఘన కీర్తి కన్నా కోరదగినది నీ నామం
జుంటె తేనె ధారల కన్నా మధురమైనది నీ నామం
సమర్పణతో నీ సన్నిధిని చేరి నిత్యము నిన్నే ఆరాధించనా
సమర్పణతో నీ సన్నిధిని చేరి నిత్యము నిన్నే ఆరాధించనా‖ కమనీయమైన ‖
Verse
వేసారిపోయిన నా బ్రతుకులో వెలుగైన నిన్నే కొనియాడనా
వేసారిపోయిన నా బ్రతుకులో వెలుగైన నిన్నే కొనియాడనా
కన్నీటితో నీ పాదములు కడిగి మనసారా నిన్నే పూజించనా
కన్నీటితో నీ పాదములు కడిగి మనసారా నిన్నే పూజించనా
నీ కృపలో గతమును వీడి మరలా నీలో చిగురించనా
నీ కృపలో గతమును వీడి మరలా నీలో చిగురించనా‖ కమనీయమైన ‖