Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kammani Bahukammani - Challani Athi Challani

కమ్మని బహుకమ్మని – చల్లని అతి చల్లని

Kammani Bahukammani - Challani Athi Challani

Verse
కమ్మని బహుకమ్మని – చల్లని అతి చల్లని
తెల్లని తేట తెల్లని – యేసు నీ ప్రేమామృతం‖ 2x ‖
జుంటె తేనె కన్న మధురం – సర్వ జనులకు సుకృతం‖ 2x ‖
యేసు నీ ప్రేమామృతం‖ 2x కమ్మని ‖
Verse
ఆశ చూపెను ఈ లోకం – మలినమాయెను నా జీవితం
యేసూ నీదు ప్రేమ – దయ చూపెను ఈ దీనురాలి పైన‖ 2x ‖
వెలిగెను నాలో నీ ఆత్మ దీపము‖ 2x ‖
కడిగిన ముత్యముగా అయ్యాను నేను‖ 2x కమ్మని ‖
Verse
నా కురులతో పరిమళమ్ములతో – చేసెద నీదు పాద సేవ
నా గుండె గుడిలో కొలువైయున్న – నీకు చేసెద నేను మధుర సేవ‖ 2x ‖
ఆరాధింతును నిన్ను అనుదినము‖ 2x ‖
జీవింతును నికై అనుక్షణము‖ 2x కమ్మని ‖

Related Tags

PraiseWorshipJesus