Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kanalenu Prabhukela

కనలేను ప్రభుకేల

Kanalenu Prabhukela

Lyricist: K Sundar Rao
Verse
కనలేను ప్రభుకేల శ్రమ సిల్వపై
మనలేను ప్రభు జూచి కఠినాత్మునై
కఠినాత్మునై…‖ కనలేను ‖
Verse
పాపులనేలేటి ప్రభునేలనో
బల్లెంపు పోటుల బంధించిరి‖ 2x ‖
కనుపించు పాపాలు రక్తాలలో
ప్రభు బాధలో‖ కనలేను ‖
Verse
ముండ్ల కిరీటము ప్రభుకేలనో
మూఢులు మోపిరి ప్రభు నెత్తిని‖ 2x ‖
ప్రభు రక్త గాయాలు నా పాపమా
ప్రభు శాపమా‖ కనలేను ‖
Verse
తన జంపు శత్రువుల క్షమియించెను
క్షమియింపుమని తండ్రిని వేడెను‖ 2x ‖
క్షమా బుద్ధి నేర్పించి చితి నోర్చెను
భరియించెను‖ కనలేను ‖
Verse
మోయజాలని సిలువ మోయించిరి
దివినేలు బాహువులు బంధించిరి‖ 2x ‖
నా పాపమంతయు ప్రభు మోసెను
భరియించెను‖ కనలేను ‖
Verse
జీవజలముల నిచ్చుఁ ప్రభుకేలనో
చేదు చిరక త్రాగను అందించిరి‖ 2x ‖
ఆత్మ దాహము తీర్చ బలి అయ్యెను
సిలువొందెను‖ కనలేను ‖
Verse
తన ఆత్మ తండ్రికి సమర్పించెను
తనదంతా తండ్రితో చాచుంచెను‖ 2x ‖
తలవంచి తండ్రిలో తుది చేరెను
కను మూసెను‖ కనలేను ‖
Verse
లోకాలనేలేటి ప్రభువేలనో
ఈ ఘోర మరణంబు గురి అయ్యెనో‖ 2x ‖
నా పాప బ్రతుకేల ప్రభువేడ్చెనో
సిలువేసెనో‖ కనలేను ‖

Related Tags

RepentanceGood FridayPassion Of Christ