Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kanare Yesuni Prathyakshambu Anya

కనరె యేసుని ప్రత్యక్షంబు అన్య

Kanare Yesuni Prathyakshambu Anya

Lyricist: తూలూరి ప్రకాశము
Chorus
కనరె యేసుని ప్రత్యక్షంబు అన్య జనులకు గల్గిన, విధమెట్లొ తరచి‖ కనరె ‖
Verse
నక్షత్రమార్గాన జ్ఞానుల్ బోయి రక్షకుని జూచిరి రక్తిమీరంగ
కాంక్షతో ప్రభునికి మ్రొక్కి కాంకల్ కాంతిమీరగ నిచ్చి తరలిరి పరగన్‖ కనరె ‖
Verse
పదియు రెండేడ్ల, ప్రాయమున ప్రభువు పస్కాపండుగునకు పరగబోయెనుగ
ముదమొప్ప దేవాలయములో జేరి ముద్దుగ బోధించె బోధకులకును‖ కనరె ‖
Verse
కానాయూరి పెండ్లికరిగి ప్రభువు ఘనముగ నీళ్లు ద్రాక్షా రసముగజేసెన్
తనరమహిమను బయలుపరచి శిష్యుల మనములబలపర్చె ఘన
విశ్వాసమున‖ కనరె ‖
Verse
కుష్థరోగి యొకడువచ్చి తనదు కుష్ఠరోగము బాప ప్రభునివేడంగ
ఇష్టబుద్ధితో ప్రభువువాని ముట్టి కుష్ఠురోగము బాపె కోర్కెలూరంగ‖ కనరె ‖
Verse
శతాధిపతి విశ్వాసమును ప్రభువు తరచి చూచి మెచ్చి దయజూపె
గనరె హితవుగవాని దాసుని పక్ష వాతంబు స్వస్థత మరిగావించెనుగ‖ కనరె ‖
Verse
గాలివానల విప్లవంబు ప్రభువు గద్దించి సద్దణిపి ఘనమహిమజూపె
గాలిసంద్రముపైన హక్కు ప్రభునికి గలదంచు శిష్యులు ఘనపరచిరిగ‖ కనరె ‖
Verse
ఇట్టిశక్తిగల ప్రభుని మనము గట్టిగనమ్మిన గలుగు రక్షణము
పట్టువీడక ప్రభునినెపుడు గుల్పి పరమశాంతిని బొంది మరివెలుగగలము‖ కనరె ‖

Related Tags

WorshipJesus ChristRevelation