Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kanipettuchuntini Prabhuvaa Nee Sannidhini

కనిపెట్టుచుంటిని ప్రభువా నీ సన్నిధినీ

Kanipettuchuntini Prabhuvaa Nee Sannidhini

Lyricist: Bro Augustine
Verse 1
కనిపెట్టుచుంటిని.. ప్రభువా నీ సన్నిధినీ….
నిన్ను ఆశ్రయించితినీ .. శరణము నీవనీ…
దాసి కన్నులు చుస్తున్నట్లుగా నా కన్నులు నిన్ను చూచుచుండగా
దాసుడు ఆశతో నిలుచునట్లుగా
నీ యెదుట నేను నిలచి యుంటిని …
Chorus
నా కన్నీరు కాదనకూ…నన్నుచూడు ఈ క్షణం
నీ ఎన్నికను కృప నిలుపూ కీడు నుండి తప్పించూ‖ 2x కనిపెట్టు ‖
Verse
నీవు నాటిన మొక్కను నేను కాయుమూ క్షామము నుండి
నీకై పూసిన పువ్వును నేను దాయుమూ సుడిగాలులనుండి …‖ 2x ‖
ప్రార్థన వినవయ్యా ప్రాణేశ్వరుండా….
కనికర పడవయ్యా…. కారుణామయుండా…‖ నా కన్నీరు ‖
Verse
నీవు రాసిన రాతను నేను నిలుపుమూ నీ రాకడవరకు
నీకై కూసిన కోయిల నేను చూడుమూ ఆశతో ఉన్నా‖ 2x ‖
నిందలచేత నిష్టురమయ్యా ఆదరణ చూపవా ఆరాదనీయుడా‖ నా కన్నీరు ‖

Related Tags

PrayerHopeWaiting