Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kanneellatho Pagilina Gundetho

కన్నీళ్లతో పగిలిన గుండెతో

Kanneellatho Pagilina Gundetho

Lyricist: Samuel Karmoji
Verse
కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా
మనసున్న మారాజేసుని మదిలో నిలుపుమా‖ 2x ‖
విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను
కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును‖ 2x విడువడు నిన్ను ‖
Verse
రాతిరంత ఏడుపొచ్చినా – కంట నీరు ఆగకుండినా
కాలమింక మారకుండునా – వెలుగు నీకు కలగకుండునా
ప్రాణమిచ్చి ప్రేమ పంచినా – పేరు పెట్టి నిన్ను పిలచినా
నీ చేయి పట్టి విడచునా – అనాథగా నిన్ను చేయునా‖ విడువడు ‖
Verse
అంధకారమడ్డు వచ్చినా – సంద్రమెంత ఎత్తు లేచినా
నిరాశలే పలకరించినా – క్రీస్తు ప్రేమ నిన్ను మరచునా
బాధ కలుగు దేశమందునా – బంధకాలు ఊడకుండునా
శత్రువెంతో పగతో రగిలినా – గిన్నె నిండి పొర్లకుండునా‖ విడువడు ‖

Related Tags

ComfortEncouragementHope