Verse
కన్నీరే మనిషిని బాధిస్తుంది
ఆ కన్నీరే మనసును ఓదారుస్తుంది‖ 2x ‖
కన్నీరే కాదనుకుంటే
ఓదార్పే కరువైపోతుంది‖ 2x ‖
Verse
కన్నీరే మరియను బాధించింది
ఆ కన్నీరే మరణము గెలిపించింది‖ 2x ‖
కన్నీరే కాదనుకుంటే
లాజరు తిరిగి బ్రతికేనా‖ 2x ‖
కన్నీరే వలదనుకుంటే
దేవుని మహిమ కనిపించేనా‖ 2x ‖
Verse
కన్నీరే హన్నాను బాధించింది
ఆ కన్నీరే కుమారుని దయచేసింది‖ 2x ‖
కన్నీరే కాదనుకుంటే
సమూయేలు జన్మించేనా‖ 2x ‖
కన్నీరే వలదనుకుంటే
దేవుని కృపను గాంచేనా‖ 2x ‖