Chorus
కన్నీరు విడిచే ఓ సోదరా
కళ్ళు విప్పి చూడు నీ ముందరా
నీ ముందు నిలిచెను నజరేయుడు చూడు
నీ ముందు నిలిచెను ప్రియ యేసుడు
కళ్ళు తుడుచుకో నీ ముందు చూసుకో ॥2॥‖ 2x ‖
Verse
ఒంటరి వానిగ చేసారా నీ ఆకలి ఎగతాళి చేసారా
లేని మాటలెన్నో చెప్పారా
నీ హృదయమంతా గాయం చేసారా
నీ తోడు ఉండువాడు విడువని వాడు
నీ తోడు ఉండువాడు మరువని వాడు ॥2॥‖ 2x ‖
కళ్ళు తుడుచుకో నీ ముందు చూసుకో ॥2॥‖ 2x ‖
Verse
దైవమే లేదని తలచు చుంటివా
దేవుని మేళ్ళను మరచి యుంటివా
ఏమి చేయనీకు తోచకున్నదా ॥2॥‖ 2x ‖
దిగులుగా దినములు గడుపు చుంటివా
ఆయన ఎదపై హాయిగా నిదురపో ॥2॥‖ 2x ‖
ఆయన కృపయే నీకు బలం
ఆయన శక్తి నిన్ను కమ్ముకొనున్
కళ్ళు తుడుచుకో నీ ముందు చూసుకో కళ్ళు ॥2॥‖ 2x ‖