Verse
కన్నీటి లోయలలో – నేనెంతో కృంగిననూ
కన్నీరు చూచువాడు – కార్యము జరిగించును‖ 2x ‖
నీ మనసు కదలకుండా – నీ మనసు కృంగకుండా
నీతోనే ఎల్లప్పుడూ – నేనుందున్ అంతం వరకు‖ 2x కన్నీటి ‖
Verse
చీకటి బాటయైనా – భయంకర శోధన
కలువున్ ఆ వేళలో – సిలువ నీడ నీకై‖ 2x నీ మనసు ‖
Verse
ఎర్ర సముద్ర తీరం – మొర్రలిడిన్ తన దాసులు
గుండెల్లో దాగి ఉన్న – గొప్ప బాధ తొలగెన్‖ 2x నీ మనసు ‖
Verse
ఎంత కాలం వేచి ఉండాలి – నాథా నీ రాకడకై
శ్రమలు తీరుటకు – ఎంతో కాలం లేదు‖ 2x నీ మనసు ‖