Verse
కన్నీటి లోయలలో నేనెంతో కృంగిననూ
కన్నీరు చూచువాడు కార్యము జరిగించును‖ 2x ‖
నీ మనసు కదలకుండా నీ మనసు కృంగకుండా
నీతోనే ఎల్లప్పుడూ నేనుందున్ అంతం వరకు‖ 2x ‖
Verse
చీకటి బాటయైనా భయంకర శోధన
కలువున్ ఆ వేళలో సిలువ నీడ నీకై‖ 2x ‖
Verse
ఎర్ర సముద్ర తీరం మొర్రలిడిన్ తన దాసులు
గుండెల్లో దాగి ఉన్న గొప్ప బాధ తొలగెన్‖ 2x ‖
Verse
ఎంత కాలం వేచి ఉండాలి నాథా నీ రాకడకై
శ్రమలు తీరుటకు ఎంతో కాలం లేదు‖ 2x ‖