Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kannulanetthi Pairula Choodu

కన్నులనెత్తి పైరుల చూడు

Kannulanetthi Pairula Choodu

Lyricist: Songs Of Zion
Verse
కన్నులనెత్తి పైరుల చూడు కోయగ లేరెవ్వరు‖ 2x ‖
ఓ యువకుడా! ఓ యువతీ! తినుచు త్రాగుచు సుఖింతువా?‖ 2x ‖
Verse
కన్నీటితో విత్తినచో కోయుదువు హర్షముతో‖ 2x ‖
ఆత్మీయ విజయముతో కొనసాగవా, నీ ప్రభుతో‖ 2x ఓ యువకుడా ‖
Verse
మోయాబున్ విడిచి నీవు యేసు ప్రభున్ హత్తుకొనవా?‖ 2x ‖
వినయమున దీనుడవై సేవింతువా ధన్యుడవై?‖ 2x ఓ యువకుడా ‖
Verse
విశ్వాస ప్రార్థనచే క్షీణతను తొలగింప‖ 2x ‖
జనములలో ప్రభు మహిమ నిండ సాగెదవా ఫలమొంద‖ 2x ఓ యువకుడా ‖
Verse
మందిరము పడియుండ మందుడవై నీవుండి‖ 2x ‖
సరంబీ గృహములలో సంతోష సమయమిదా?‖ 2x ఓ యువకుడా ‖
Verse
మహిమ ఆర్భాటముతో క్రీస్తు రాజు వేంచేయ‖ 2x ‖
నమ్మకమైన దాసునిగా ఎదుర్కొందువు హల్లెలూయా‖ 2x ఓ యువకుడా ‖

Related Tags

EvangelismYouthHarvest