Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kannulatho choose ee lokam entho andamugaa srushtinchabadenu bhoolokam

కన్నులతో చూసే ఈ లోకం ఎంతో అందముగా సృష్టించబడెను భూలోకం

Kannulatho choose ee lokam entho andamugaa srushtinchabadenu bhoolokam

Verse
కన్నులతో చూసే ఈ లోకం ఎంతో – అందముగా సృష్టించబడెను భూలోకం
దేవుని ఆలయముగా ఈ దేహం – పరిశుద్ధునిగా సృష్టించే శరీరం
నా దేవుని సృష్టియేగా ఈ లోకం – ఆ సృష్టికర్త పనియేగా
నా యేసుని సృష్టియేగా ఈ లోకం – ఆ సృష్టికర్త పనియేగా… ఈ దేహం
Verse
అల్ఫా ఒమెగయైన మహిమకు పాత్రుడైన దేవుడు
మహిమ పొందాలని ఘనత నొందాలని
వేవేల దూతలతో కొనియాడబడు దేవునికి
నువ్వు కావాలని తన రాజ్యం స్థాపించాలని‖ 2x ‖
తన పోలికలో నిర్మించుకొని – ఆ హృదిలో ఉండాలని‖ 2x ‖
నా దేవుడే కోరెనుగా – నీ హృదయాన్ని తనకీయవా‖ కన్నులతో ‖
Verse
నీటిబుడగ వంటిదేగా ఈ జీవితం
ఆవిరైపోవును ఇది మన్నైపోవును
అల్ప కాలమేగా ఈ లోకము
పాడైపోవును ఇది లయమైపోవును‖ 2x ‖
ఈ సృష్టిని దేవునిగా నీవు సృష్టిని పూజించావు
సృష్టికర్త దేవుడినే మరచి అంధుడవై బ్రతికావు
ఆ యేసయ్య నీ కోసమై నీ శాపాన్ని భరియించెను
నిత్య జీవము నీకిచ్చుటకై సిలువలో చేతులే చాచి నిను పిలచెను‖ కన్నులతో ‖

Related Tags

SalvationGods LoveCreation