Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kannulundi Choodaleva

కన్నులుండి చూడలేవ

Kannulundi Choodaleva

Verse
కన్నులుండి చూడలేవ యేసు మహిమను
చెవులుండి వినలేవ యేసు మాటను‖ 2x ‖
నాలుకుండి పాడలేవ యేసు పాటను
కాళ్ళు ఉండి నడువలేవ యేసు బాటను‖ కన్నులుండి ‖
Verse
చెడును చూడకుండ నీ కనులను
చెడును వినకుండ నీ చెవులను‖ 2x ‖
చెడును పలుకకుండ నీ నాలుకన్
చెడులో నడువకుండ నీ కాళ్ళను
దూరముగా నుంచు ఓ సోదరా
దూరముగా నుంచు ఓ సోదరీ‖ 2x కన్నులుండి ‖
Verse
దుష్టుల ఆలోచన చొప్పునా
నడువక సాగుమా నీ యాత్రలో‖ 2x ‖
పాపుల మార్గమందు నీవు నిలువక
అపహాసకులు కూర్చుండు చోటను
కూర్చుండకుమా ఓ సోదరా
కూర్చుండకుమా ఓ సోదరీ‖ 2x కన్నులుండి ‖
Verse
యెహోవా దొరుకు కాలమందునా
ఆయనను మీరు వెదక రండి‖ 2x ‖
ఆయన మీ సమీపమందు నుండగా
ఆయననూ మీరు వేడుకొనండి
ఆయన తట్టు తిరుగు ఓ సోదరా
ఆయన తట్టు తిరుగు ఓ సోదరీ‖ 2x కన్నులుండి ‖

Related Tags

RepentanceChristian LifeCorrection