Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kanta Neerela? Kalathalu

కంట నీరేల? కలతలు

Kanta Neerela? Kalathalu

Verse
కంట నీరేల? కలతలు ఏల?
యేసుతో నీవు సాగు వేళ
శోధన వేళ రోదన ఏల?
నీ విశ్వసము గెలిచే వేళ‖ 2x ‖
నమ్మిన ఆ దేవుడు – ఎన్నడు మరచిపోడు
నీయొక్క అవసరాలు – ఏనాడో తానెరిగాడు‖ కంట ‖
Verse
వలదు చింతన దేనికైనా
విన్నవించుము నీ నివేదన‖ 2x ‖
పొందితినను నీదు నమ్మకము
దరికి చేర్చును తగిన విజయము‖ 2x ‖
తిరుగన్నదే లేనివి – ఆ తండ్రి దీవెనలు
పొరపాటు ఎరుగనివి – తానిచ్చు ఆ మేలులు‖ 2x కంట ‖
Verse
రేపు గూర్చిన భయము వలదు
ప్రతి దినము తగు బాధ కలదు‖ 2x ‖
నీదు భారము మోయు ఆ దేవుడు
నీకు ముందుగా నడుచు ఎల్లప్పుడు‖ 2x ‖
నీలోని ఆ భయము – లోకానికి ప్రతిరూపం
స్థిరమైన నీ విశ్వాసం – దేవునికి సంతోషం‖ 2x కంట ‖

Related Tags

FaithComfortTrust