Verse
కంటి పాప వలే నన్ను కాచుటకు - నేను అర్హుడనా నేను అర్హుడనా
ఘోర పాపినైన నను మన్నించుటకు - నేను అర్హుడనా నేను అర్హుడనా
వేదనలు భరియించి అవమానం సహియించి
నా కోరకు సిలువలో ప్రాణమును అర్పించుటకు నేను అర్హుడనా
Verse
నన్ను పరమున చేర్చుటకు నీవే నా దరి చేరితివి
నాకు విడుదలనిచ్చుటకు నా దోషములు మోసితివి
నా శాపము తొలగించుటకు నీవే పాపముగా మారి
నన్ను శుద్ధుని చేయిటకు నీ రక్తము చిందించితివి
నాలో ఉపిరి నిలుపుటకు నీ తుది శ్వాస వీడితివి
ఇంత ప్రేమ చూపుటకు నేనర్హుడనా‖ నాలో ఉపిరి ‖
Verse
కంటి పాప వలే నన్ను కాచుటకు - నేను అర్హుడనా నేను అర్హుడనా
అల్పుడను నను కరుణించి రక్షణ కవచము నాకిచ్చి
యోగ్యడవంటు నను పిలచి నీ వారసునిగా చేసితివి
అర్పింతును దేవా నీకే సర్వ ఘణత ప్రభావములు
నా జీవిత పర్యంతము నీ దాసుడనై బ్రతికెదను
నీ చరణములను హత్తుకొని అద్దరి చేరుకొందునయా
నీ మహిమ కాంతులలో నీవసింతునయా‖ నీ చరణములను ‖