Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kanuchoopu Meralona

కనుచూపు మేరలోన

Kanuchoopu Meralona

Lyricist: A R Stevenson
Verse
నేనున్నా నీతో అంటూ
నా చెంతకు చేరావు
యేసయ్యా.. యేసయ్యా…
Verse
కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళ
ఎటు తోచక లోలోన నే కృంగియున్న వేళ
నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు‖ 2x ‖
Verse
మొదలుపెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగా
బెదిరిపోయి నా హృదయం బేలగా మారిపోగా‖ 2x ‖
పని పూర్తి చేయగ బలము లేని వేళ‖ 2x ‖
నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
నా ఆటంకాలన్నిటిని యేసూ తొలగించావు‖ 2x ‖
Verse
శ్రమలు తెచ్చిన దుఃఖం శాంతినే దోచుకోగా
చెదిరిపోయి ఆశల సౌధం నా గొంతు మూగబోగా‖ 2x ‖
స్తుతి పాట పాడగ స్వరము రాని వేళ‖ 2x ‖
నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
నా నోటను నూతన గీతం యేసూ పలికించావు‖ 2x ‖
Verse
కపట మిత్రుల మోసం అగ్నిలా కాల్చబోగా
సడలిపోయి నా విశ్వాసం ధైర్యమే లేకపోగా‖ 2x ‖
అడుగేసి సాగగ అనువుకాని వేళ‖ 2x ‖
నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
నా ప్రార్థనకు ఫలమిచ్చి యేసూ నడిపించావు‖ 2x కనుచూపు ‖

Related Tags

ComfortEncouragementHope