Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kanugontini Ninne O Najareya

కనుగొంటిని నిన్నే ఓ నజరేయా

Kanugontini Ninne O Najareya

Verse
కనుగొంటిని నిన్నే ఓ నజరేయా - సమర్థుడవని సహాయము చేయ
నీ ప్రభావము - నాలోకి చేరగా - నా స్వరూపమూ - మారిపోయెగా
Verse
ప్రయత్నాలు చేసి వేసారియుంటిని - ఉన్న ఆస్తినంతా చేజార్చుకొంటిని
వైద్యులచుట్టూ - కాళ్లు అరిగేటట్టు - ఎంతతిరిగినా - సరికాక యుంటిని
Verse
స్వంతజనులతోనే వెలివేయబడితిని - అపనిందలపాలై మతిపోయి చెడితిని
బ్రతుకెందుకని - మనసే చంపుకుని - జీవశ్చవమై - ఇల మిగిలియుంటిని
Verse
నీ మహిమను గూర్చి వార్తలను వింటిని - స్వస్తపరచు దేవా నిను నమ్ముకొంటిని
ధైర్యములేక - ఎదురుగ రాలేక - వెనుకనుండి వచ్చి నిను ముట్టుకుంటిని

Related Tags

FaithHealingDevotion