Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kanulunna Kaanaleni Chevulunna Vinaleni

కనులున్నా కానలేని చెవులున్నా వినలేని

Kanulunna Kaanaleni Chevulunna Vinaleni

Verse
కనులున్నా కానలేని చెవులున్నా వినలేని‖ 2x ‖
మనసున్నా మతిలేని స్తితియున్నా గతిలేని‖ 2x ‖
వాడను యేసయ్యా
ఓడిపోయిన వాడను‖ 2x కనులున్నా ‖
Verse
అన్ని ఉన్నా ఏమిలేని అందరు ఉన్న ఏకాకిని
దారి ఉన్నా కానరాని చెంతనున్నా చేరలేని
యేసయ్యా నన్ను విడువకయ్యా‖ 2x ‖
దిక్కులేని వాడను
వాడను యేసయ్యా
చెదరిపోయిన గూడును‖ 2x కనులున్నా ‖
Verse
భాషలున్నా భావములేని ఆత్మ ఉన్నా అవివేకిని
భక్తి ఉన్నా శక్తిలేని ప్రార్థన ఉన్నా ప్రేమలేని
యేసయ్యా నన్ను కరుణించుమా‖ 2x ‖
ఫలములేని వాడను
వాసిని యేసయ్యా
పేరుకు మాత్రమే విశ్వాసిని‖ 2x కనులున్నా ‖
Verse
బోధ ఉన్నా బ్రతుకులేని
పిలుపు ఉన్నా ప్రయాసపడని
సేవ ఉన్నా సాక్ష్యములేని
సంఘము ఉన్నా ఆత్మలులేని
యేసయ్యా నన్ను నింపుమయ్యా‖ 2x ‖
ఆత్మలేని వాడను
పాదిరిని యేసయ్యా
మాదిరి లేని కాపరిని‖ 2x కనులున్నా ‖

Related Tags

PrayerRepentance