Verse
కనురెప్ప పాటైన కను మూయలేదు – ప్రేమ ప్రేమ ప్రేమ
నిరుపేద స్థితిలోను నను దాటిపోలేదు – ప్రేమ ప్రేమ ప్రేమ‖ 2x ‖
పగలూ రేయి పలకరిస్తోంది
పరమును విడిచి నను వరియించింది‖ 2x ‖
కలవరిస్తోంది ప్రేమా
ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ‖ కనురెప్ప ‖
Verse
ప్రేమ చేతిలో నను చెక్కుకున్నది
ప్రేమ రూపుతో నను మార్చియున్నది‖ 2x ‖
ప్రేమను మించిన దైవం లేదని
ప్రేమను కలిగి జీవించమని‖ 2x ‖
ఎదురు చూస్తోంది ప్రేమా
కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ‖ కనురెప్ప ‖
Verse
ప్రేమ లోగిలికి నను పిలుచుచున్నది
ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది‖ 2x ‖
ప్రేమకు ప్రేమే తోడవుతుందని
ప్రేమకు సాటి లేనే లేదని‖ 2x ‖
పరవశిస్తోంది ప్రేమా
కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ‖ కనురెప్ప ‖