Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kanya Garbhamuna Butti Karunagalgu

కన్యా గర్భమున బుట్టి కరుణగల్గు

Kanya Garbhamuna Butti Karunagalgu

Lyricist: Mikkili Devasahayam
Chorus
కన్యా గర్భమున బుట్టి కరుణగల్గు బాలుఁడవైన కన్యా సుతుండ నిన్నే
నమ్మితి నో యేసునాధ కన్ను లెత్తి మమ్ముఁ జూడుము‖ కన్యా ‖
Verse
బాల ప్రాయమున నేను బాగుగా నీ పాద సేవఁ జాలజేసి యున్న వా
డనుగా యో యేసు నాధ చాల దయతో మేలు చేయుమి‖ కన్యా ‖
Verse
ఇంపైనట్టి మరియ తనయ యిహము పరము నేలు బాల సొంపుగా నీ
ప్రాపే గోరితి నో యేసునాధ చెంపఁ గొట్టి బుద్ధి చెప్పుము‖ కన్యా ‖
Verse
తుంటతనము చేత జగము తంటాచేసి తిరుగుచుంటి నంటిన మాయల
బాధల నో యేసు నాధ యంటుఁ బాపి జంటజేయుము‖ కన్యా ‖
Verse
మింట నుండి నీవు వచ్చి మంటి పైని బాలుఁడ వగుచుఁ గంటి కింపు
గాను నడిచితి వో యేసు నాధ కానుపర్చి తోవు త్రోవను‖ కన్యా ‖

Related Tags

DevotionalJesusChristmas