Verse 1
కరములే కరములు యేసయ్యా కృపగల కరములు
నా జీవితానికి ఆధారము నా జీవితానికి ఆశ్రయము
కరములే కరములు యేసయ్యా కరుణగల కరములు
నీ కరములే నను సృష్టించే – నీ కరములే నను రక్షించే
Verse
మరణ పడకలో ఉన్నప్పుడు
కృపతో నిలిపెను నీ కరములు ప్రభు
ఎవ్వరు హామీ యివ్వలేదే
నను ఆదుకొనెను నీ కరములు ప్రభు
నను ఆదరించే నీ కరములు‖ కరములే ‖
Verse
వీధులలో కాడిని మోసి
చీరుకుపోయెను నీ కరములు ప్రభు
కాడిని నన్ను మోయనియ్యక
నీవే కాడిని మోసితివా ప్రభు
నాకై కాడిని మోసితివా‖ కరములే ‖
Verse
ఓపిక లేక సొమ్మసిల్లిన
చేతులు నాకై చాపితివా ప్రభు
మేకులు కొట్టిర అరచేతులలో
బలియై పోతివ నా కోసము ప్రభు
బలియాగమైతివ నా కోసమే‖ కరములే ‖