Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Karuna Choopinchumaa

కరుణ చూపించుమా

Karuna Choopinchumaa

Lyricist: Sayaram Gattu
Verse
కరుణ చూపించుమా – యేసయ్య కన్నీరు తుడవగా
మహిమ కురిపించుమా – యేసయ్య స్వస్థతలు చూపగా‖ 2x ‖
నీ ప్రజలము అయిన మేము – మృత్యువు కోరలో చిక్కాము
ఏ దారియు కానరాక – నశియించి పోతున్నాము‖ 2x ‖
కరుణగల దేవుడు నీవు
కరుణించి కాపాడుమా‖ 2x కరుణ ‖
Verse
ఐగుప్తులో పది తెగుల్లలో – నీ ప్రజలను కాపాడితివి
గొఱ్ఱెపిల్ల రక్తము నిచ్చి – మృత్యువాత తప్పించితివి‖ 2x ‖
నీ నామము మదిలో నిలిపి – ఈ ఆపదలో వేడాము
నీ మహిమను తిరిగి చూడగా – నీ సన్నిధిలో చేరాము‖ 2x కరుణగల ‖
Verse
ఇశ్రాయేలు వారిగ మేము – నీ ఉనికిని ప్రశ్నించాము
నీ ప్రేమను రుచి చూసిననూ – మారాను కురిపించాము‖ 2x ‖
చెలరేగే సర్పము కాటు – మములను కబళించే వేళ
మాకు దిక్కు నీవేనంటూ – మోకరించి నిను వేడితిమి‖ 2x కరుణగల ‖
Verse
మరణమునే జయించి నీవు – సజీవుడిగా నిలిచావు
నిన్ను నమ్మి వేడిన చాలు – మా తప్పులు మరిచావు‖ 2x ‖
నేను జీవించితి గనుక – మీరును జీవించెదరన్న
వాగ్దానము నమ్మితిమయ్యా – నెరవేర్చుము మా యేసయ్య‖ 2x కరుణగల ‖

Related Tags

PrayerComfortRepentance