Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Karuna Sampannuda Dheeruda Sukumaruda

కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా

Karuna Sampannuda Dheeruda Sukumaruda

Lyricist: John Wesley
Chorus
కరుణాసంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెద‖ 2x ‖
నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే
నా యేసయ్యా సాత్వికుడా
నీ కోసమే నా జీవితం‖ 2x ‖
Verse
ఏనాడు నను వీడని నీ ప్రేమ సందేశము నా హృదయసీమలోనే సందడిని చేసెను‖ 2x ‖
అణువణువును బలపరచే నీ జీవిపు వాక్యమే ప్రతిక్షణము దరి చేరి నన్నే తాకెను‖ 2x ‖
ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసే నన్నే నడిపించెను
Verse
ఈ వింత లోకంలో నీ చెంత చేరితిని ఎనలేని ప్రేమతోనే ఆదరణ పొందితిని‖ 2x ‖
నీ కృపలో నిలిపినది నీ ప్రేమబంధమే అనుదినము మకరందమే నీ స్నేహబంధము‖ 2x ‖
ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా స్థిరపరచుమా
Verse
నే వేచియున్నాను నీ మహిమ ప్రత్యక్షతకై నాకున్నా ఈ నిరీక్షణే సన్నిధిలో నిలిపినది‖ 2x ‖
నా కోసం నిర్మించే సౌందర్యనగరములో ప్రణమిల్లి చేసెదను నీ పాదాభివందనం‖ 2x ‖
తేజోమయా నీ శోభితం నే పొందెద కొనియాడెద

Related Tags

PraiseWorshipJesus