Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Karunaa Karudaa Nee Maargamu Parishudhdha Sthalamuloa Galadhu

కరుణా కరుడా నీ మార్గము పరిశుద్ధ స్థలములో గలదు

Karunaa Karudaa Nee Maargamu Parishudhdha Sthalamuloa Galadhu

Chorus
కరుణా కరుడా - నీ మార్గము - పరిశుద్ధ స్థలములో గలదు - అది
Verse
యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు - వారు
తిరిగి వచ్చెదరు సీయోనునకు
Verse
చక్కగ వారి తలలమీద శాశ్వతానందము కలుగున్ - తమ
సంతోషం అధికంబగును
Verse
మోక్షానంద భాగ్యముగలిగి అక్షయులై అరుదెంచెదరు - తమ
దుఃఖం నిట్టూర్పును పోవును
Verse
విరివిగ శిష్యులానందముతో పరిశుద్ధాత్మతో నిండి - తమ
ప్రభుని కొనియాడిరి బహుగా
Verse
ప్రభు రాజ్యము తిని త్రాగుట కాదు
ప్రవిమల నీతి సమాధానం - అది - పరిశుద్ధాత్మానందము
Verse
మహోన్నతుడే మనకానందం
మహా బలము కలుగును గాక - అది మహిమార్థంబగును గాక
Verse
హల్లెలూయ ఎల్లరుపాడి
హర్షింతుము ప్రభుయేసునిలో - మన రక్షకుడేసుని పాడెదము

Related Tags

WorshipHolinessPsalm