Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Karunaayutham Baukaaryamulu Kanabadavalege

కఱుణాయుతం బౌకార్యములు కనబడవలెగ

Karunaayutham Baukaaryamulu Kanabadavalege

Lyricist: Jonnakuti Daniel
Chorus
కఱుణాయుతం బౌకార్యములు కనబడవలెగాదా మనలో అనవరతము
మన బ్రతుకు ప్రభునికై అంకితమగునటు నలవరచుకొనగ‖ కఱుణా ‖
Verse
పొరుగవాని ప్రేమింతము మనము కొరతలన్ని యిక దీరును మనకు
తరుగుపడ్డదా గుణమది మనలో త్వరితగతిని సవరించుకొందమిక‖ కఱుణా ‖
Verse
కుంటి గ్రుడ్డి కుష్ఠు రోగులెందరో కంఠమెత్తి ఘోషించుచు నుండ
ఇంటగుడిచి సుఖియించుట న్యాయమ వంటబట్టదది స్వార్థ పర్వతము‖ కఱుణా ‖
Verse
పండువంటి కాపురంబు మనది దండిప్రభుడు దయచేసెను మనకది
బండు లోడలౌ ఓడలు బండ్లౌ ముండ్ల కిరీటము ముందు బెట్టుకొని‖ కఱుణా ‖
Verse
మనుజులందు గలవు రెండు తెగలు వినుము పుచ్చుకొనెడువారి దొక
తెగ మనసు దీర నిచ్చువారిదొక తెగ గనుమ మనస నీవెందుగలవొ యిక‖ కఱుణా ‖
Verse
కఱుణ రసము మాకుప్రభువా కలుగను కృపా నిమ్మా యెపుడు అరమర
లేకను అన్ని సమయముల నందర ప్రేమను జూడగ నడుపుమ‖ కఱుణా ‖

Related Tags

DedicationLoveChristian ServiceCompassion