Chorus
కఱుణాపీఠము జేరరే దేవుని కృపా చరణ స్థలిని జేరరే పరలోక
జనకుని వరములు లభియించు తరుణమౌ ప్రార్థనలో కరములు జోడించి‖ కఱుణా ‖
Verse
హృదయ వేదననొందుచు యాకోబు తన మదిలో భయమున గుందుచు
వదల కుండగ ప్రభుని పదములు సంధించి సదయుని దీవెన ముదమున‖ నొందిన కఱుణా ‖
Verse
కన్న ప్రేమను యిమ్మని సోదరి హన్నా విన్నవించగా దేవుని అన్ని
యెఱిగిన తండ్రి హన్నాను దీవింప వన్నె కెక్కిన కొడుకున్ చెన్నుగా‖ నొందిన కఱుణా ‖
Verse
శాప భయమును నేడ్చుచు దావీదు తన పాప రూపము జూచుచు
తాపముతో పశ్చా త్తాపముతో ప్రభుని ప్రాపు గోరగనే క్ష మాపణ నొందిన‖ కఱుణా ‖
Verse
కాయమున వెత నోర్చును యోధుడు పౌలు సాయమీ ధర గోరుచు
రోయుచు దన ముల్లు దీయుమని ప్రార్థించి వేయిరెట్లుగ కృపయు‖ ప్యాయముగ నొందిన కఱుణా ‖
Verse
దినమంత పని జేయుచు నాధుడా యేసు జనుల బాధల మోయుచు
ఇనుడు మరుగౌవేళ జనకుని కడకేగి మనసార విశ్రాంతి యనుభవించిన‖ సథలము కఱుణా ‖
Verse
ఇల బ్రతుకంతయు ప్రార్థన ప్రభు యేసునకు సిలువే తన తుది ప్రార్థన
చెలువుగ విజ్ఞాప నలు జేయుచును మనపై గలకాలమును దీవె నలు‖ వర్షించెడి చోటు కఱుణా ‖