Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Karunasagara Veevekaava Maranamondha Sil

కరుణసాగర వీవేకావా మరణమొంద సిల్

Karunasagara Veevekaava Maranamondha Sil

Lyricist: Gollapalli Nathaniel
Verse
కరుణసాగర వీవేకావా మరణమొంద సిల్వ మెట్టకు మోసినావా కరుణ
సాగర వీవెకావ మరియు కల్వరి మెట్టమీఁదను కడకు మేకులుఁ గొట్టబడి
నీ మరణరక్తము చేత నరులకు పరమరక్షణఁ దెల్పినావా‖ కరుణ ‖
Verse
నజరేతు పుర విహారా నరులఁ బ్రోవ నరు దెంచినావా నజరేతు
పురవిహారా ప్రజలపాపముఁ బరిహరించియు ప్రజల సద్గతి నొందఁ
జేయను విజయమునుఁ బొందితివి యిలలో సజనులందరు భజనసేయఁ‖ నజరేతు ‖
Verse
మరియయనే కన్యకుమారా నరకబాధఁ దప్పించినావా మరియయనే
కన్యకుమారా మార్గసత్యము జీవనములీ మహిని నమ్మిన వారి కెల్లను
మీరెగాకిఁక వేరేలేరని సారెసారెకుఁ జెప్పినావా‖ మరియయనే ‖
Verse
మహిలోను మనుజకుమారా యహా తండ్రిని వేడినావా మహిలోను
మనజకుమారా యిహములోనిను నమ్మువారిని బహు నీ కటాక్షంబుచేతను
మహిమజనకా గావుమనుచు త్రాహియని బ్రార్ధించి నావా‖ మహిలోను ‖
Verse
పరమతండ్రి ప్రియకుమారా పావనముజేయ మీరేకారా పరమతండ్రి
ప్రియకుమారా పరముడా నీ పంచగాయము లరయగా రక్తముతో నిండెను
ధరను మా పాపములుఁ గడుగను చిరముగా ను త్త రమునాయె‖ పరమతండ్రి ‖

Related Tags

Good FridaySacrificePassion