Chorus
కరుణాత్ముడే కదిలొచ్చాడే
అరుణోదయుడై అరుదెంచాడే‖ 2x ‖
Verse
ఆశీర్వాదాలు మొదలాయెనే
చీకటి బ్రతుకులకు వెలుగాయెనే.‖ 2x ‖
Verse
పుడమే పులకింపగా - జగమే తరియింపగా
Chorus
నేను పాడెదా - కొనియాడేదా
నేను ఆడేదా - చిందాడేదా‖ 2x ‖
Verse
లోక రక్షకుడే పరమును విడిచి వచ్చాడే
ఓ చిన్ని పాకలో పావనుడై పవలించాడే.‖ 2x ‖
Verse
ఆశ్చర్యమే, తన మహిమను విడిచి వచ్ఛాడే
ఇంకా కంఫర్మే నిత్య రాజ్యపు వారసులవ్వటమే
బంగారు సాంబ్రాణితో నా స్తుతి గానాలతో
Chorus
నేను పాడెదా - కొనియాడేదా
నేను ఆడేదా - చిందాడేదా‖ 2x ‖
Verse
కారణమే ఉంది కారణజన్ముని రాకకు
భూనివాసులందరిని పరమునకు చేర్చుటకు‖ 2x ‖
Verse
ఇంకా సంబరమే, ఊరువాడంతా ఏకమై ఆడాలే
ఆర్భాటమే, చేయి చేయి కలిపి సువార్త చాటాలే
లోకమే ద్వేషించినా, బాధకు గురి చేసినా
Chorus
నేను పాడెదా - కొనియాడేదా
నేను ఆడేదా - చిందాడేదా‖ 2x ‖