Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Karuninchi Thirigi Samakoorchu

కరుణించి తిరిగి సమకూర్చు

Karuninchi Thirigi Samakoorchu

Lyricist: Songs Of Zion
Verse
కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా‖ 2x ‖
క్షమాపణ నిన్ను వేడుచున్నాను‖ 2x ‖
Verse
దావీదు రాజు దీనుడై వేడ‖ 2x ‖
అవనిలో బొందిన నష్టములన్నియు‖ 2x ‖
దేవా నీవు సమకూర్చితివే‖ 2x కరుణించి ‖
Verse
శత్రు సమూహపు కుతంత్రములతో‖ 2x ‖
బొత్తిగా నేను నష్టపడితిని‖ 2x ‖
మిత్రుడేసులో సమకూర్చుము తండ్రి‖ 2x కరుణించి ‖
Verse
పసరు గొంగళి – చీడ పురుగులు‖ 2x ‖
నాశనము చేసిన పంటను కూర్చుమా‖ 2x ‖
యేసు ప్రభూ నిన్ను వేడుచున్నాను‖ 2x కరుణించి ‖
Verse
ప్రేమ సంతోషానందములను‖ 2x ‖
ప్రధాన యాజకా పోగొట్టుకొంటిని‖ 2x ‖
ప్రేమతో నీవు సమకూర్చుమా‖ 2x కరుణించి ‖
Verse
పాపపు విషముతో నా పాత్ర నిండెను‖ 2x ‖
ప్రభు యేసుండను పిండిని కలుపుము‖ 2x ‖
పాప మరణమును తొలగించుమా‖ 2x కరుణించి ‖
Verse
ఆత్మీయ సోమరితనములో నుండి‖ 2x ‖
ఆత్మ నష్టముల నెన్నియో బొందితి‖ 2x ‖
ఆత్మ దేవా నీవు సమకూర్చుమా‖ 2x కరుణించి ‖
Verse
పాపము చేసి పడియున్న చోటున్‖ 2x ‖
ప్రాపుగా నీవు జూపుమో ప్రభువా‖ 2x ‖
కోపగించక నాపై కృప జూపుమా‖ 2x కరుణించి ‖
Verse
చేసిన పాపము కప్పుకొనక‖ 2x ‖
విశ్వాసముతో ఒప్పుకొందున్‖ 2x ‖
సిలువ రక్తముతో శుద్ధి చేయుమా‖ 2x కరుణించి ‖

Related Tags

PrayerRepentanceForgiveness