Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Karuninchi Thirigi Samakoorchu Prabhuvaa Kshamaapana Ninnu Veduchunnaanu

కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను

Karuninchi Thirigi Samakoorchu Prabhuvaa Kshamaapana Ninnu Veduchunnaanu

Verse
కరుణించి తిరిగి - సమకూర్చు ప్రభువా - క్షమాపణ నిన్ను వేడుచున్నాను
Verse
దావీదు రాజు - దీనుడై వేడ
అవనిలో బొందిన నష్టములన్నియు
దేవా నీవు - సమకూర్చితివే
Verse
శత్రు సమూహపు - కుతంత్రములతో
బొత్తిగ నేను - నష్టపడితిని
మిత్రుడేసులో - సమకూర్చుము తండ్రి
Verse
పసరు గొంగళి - చీడ పురుగులు
నాశము చేసిన - పంటను కూర్చుమ
యేసు ప్రభూ - నిన్ను వేడుచున్నాను
Verse
ప్రేమ సంతోషా - నందములను
ప్రధాన యాజకా - పోగొట్టు కొంటిని
ప్రేమతో నీవు - సమకూర్చుమా
Verse
పాపపు విషముతో - నా పాత్ర నిండెను
ప్రభు యేసుండను - పిండిని కలుపుము
పాప మరణమును - తొలగించుమా
Verse
ఆత్మీయ సోమరి - తనములో నుండి
ఆత్మనష్టముల - నెన్నియో బొందితి
ఆత్మదేవా నీవు - సమకూర్చుమా
Verse
పాపము చేసి - పడియున్న చోటున్
ప్రాపుగ నీవు - జూపుమో ప్రభువా
కోపగించక నాపై - కృప జూపుమా
Verse
చేసిన పాపము - కప్పుకొనక
విశ్వాసముతో - ఒప్పుకొందున్
సిలువరక్తముతో - శుద్ధి చేయుమా

Related Tags

PrayerRepentanceRestoration