Verse
కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా
ఈ జీవి నీ తోడు ఎడబాసి పోదులే‖ 2x ‖
ఓ యేసయ్యా…
ఈ జీవి నీ తోడు ఎడబాసి పోదులే‖ 2x ‖
Verse
నిను ఎడబాసినపుడు – నా బ్రతుకే దండగా
బ్రతికున్న మూన్నాళ్ళ – నీతోనే పండుగా
యేసయ్య మార్గమే నడవర ఓరన్న‖ 2x కష్ట ‖
Verse
కొండగా అండగా – నీవుండగ లోకాన
ఎండిన ఎముకలయినా – ఉండుగా జీవంగా
యేసయ్య మార్గమే నడవర ఓరన్న‖ 2x కష్ట ‖
Verse
కారు మబ్బు కమ్మినా – కాలమెదురు తిరిగినా
నీ సిలువ నెత్తుకొని – నే సాగిపోతాను
నీ సిలువ నెత్తుకొని – నే సాగిపోతాను‖ 2x కష్ట ‖