Chorus
కఠిన హృదయమా కరుగవ దేవుని గడువులు
గని వినవా దెబ్బలు గలిగిన లోబడవా
Verse
ఎన్నో గడువులు ఎన్నోమారులు ఎన్నో గడువులు దొరికినను
కన్నుమూసికొని కదలుచునుందువు కనికర కరమునుగని మానవా‖ కఠిన ‖
Verse
సృష్టికర్తకు మ్రొక్కెదవా! తన సృష్టిని గొని పూజించెదవా
సృష్టికర్త విరోధి దయ్యముల చేష్టలెల్ల మంద్రించెదవా‖ కఠిన ‖
Verse
నీరము రక్తముగా మారినను భారముగా క ప్పలు పేలు
జోరీగలు గొప్ప తెగులు వచ్చిన గుణపడెనా ఫరోరాజు!
Verse
దద్దురులై బొబ్బలు పొక్కినను హద్దులేక పిడుగులు పడిన
గ్రుద్దినట్లు వడగండ్లు కురిసినను గుణపడెనా ఫరోరాజు‖ కఠిన ‖
Verse
మిడుతల దండులు చెలరేగి యామిగిలిన వాటిని మ్రింగినను
వడివడితడబడు నంధకారమే వచ్చిన గుణపడె నా రాజు‖ కఠిన ‖
Verse
ఘోషపెట్టి దేశమెల్లనేడ్వగ గుంపులుగా జ్యేష్టులు చావ
రోషముతో వెంటబడి నశించి దోషముకై దుఃఖముపడిరే‖ కఠిన ‖
Verse
నష్టము కష్టము కలిగినను మరి నరులును దేవుడె చెప్పినను
ఇష్టపడవు రక్షింపబడుటకై ఇరుకుపడిన నిరుకున జెడిన‖ కఠిన ‖
Verse
పాపప్రతాపము నెరుగుదువ దాని శాపము తాపము నెరుగు
దువా పాపము నొకపరి బట్టితివా అది పట్టుబడి కఠినపరచు‖ కఠిన ‖
Verse
లోలోపలన న్యాయమబద్దములోపము కలిగిన మోసములో
కాలయాపనచేయ నుపాయములేల? వేషధారణయేల‖ కఠిన ‖