Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kattelapai Nee Shareeram Kanipinchadu Gantaku Ma

కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మ

Kattelapai Nee Shareeram Kanipinchadu Gantaku Ma

Verse 1
కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ
మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి
ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి గాధ
Verse
దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను
తన ఆశ నీలో చూసి పరితపించిపోవాలని‖ 2x ‖
కన్న తండ్రి నే మరచి కాటికెళ్ళిపోతావా
నిత్య జీవం విడచి నరకమెళ్ళి పోతివా‖ 2x ‖
Verse
ఆత్మ నీలో ఉంటేనే అందరు నిను ప్రేమిస్తారు
అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు‖ 2x ‖
కన్నవారే ఉన్ననూ కట్టుకున్న వారున్ననూ
ఎవ్వరికీ కనిపించక నీ ఆత్మ వెళ్లిపోవును‖ 2x ‖

Related Tags

RepentanceDeathMortality