Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kavulakainaa Saadhyamaa

కవులకైనా సాధ్యమా

Kavulakainaa Saadhyamaa

Lyricist: John Wesley
Verse
కవులకైనా సాధ్యమా నీ కృపను వర్ణించడం
ప్రేయసికైనా సాధ్యమా నీ ప్రేమను అందించడం
శిల్పికైనా సాధ్యమా నీలా నిర్మించడం
రాజుకైనా సాధ్యమా నీలా వరమీయడం‖ 2x కవులకైనా ‖
Verse
చెదరిన మనసులకూ శాంతి
కృంగిన హృదికీ ఓదార్పు
మృత్యు దేహముకూ జీవం
బలహీనులకు ఆరోగ్యం‖ 2x ‖
పరమ వైద్యునిగా నీవు చేసే స్వస్థతా కార్యాలు
గాయపడిన నీ హస్తము చేసే అద్భుత కార్యాలు
మోసపూరిత ఈ లోకంలో
ఏ వైద్యునికి సాధ్యము‖ 2x కవులకైనా ‖
Verse
క్షణికమైన అనురాగాలు
ఆవిరివంటి ఆప్యాయతలు
అవసరాల అభిమానాలు
నిలచిపోయే అనుబంధాలు‖ 2x ‖
నవ్యకాంతులమయమైన నీదు కల్వరి ప్రేమ
ఆనందజ్వాలలు కలిగించే నీదు నిర్మల స్నేహం
స్వార్ధపూరిత ఈ లోకంలో
ఏ మిత్రునికి సాధ్యము‖ 2x కవులకైనా ‖

Related Tags

PraiseWorshipGraceLove