Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Keerthinthu Nee Naamamun

కీర్తింతు నీ నామమున్

Keerthinthu Nee Naamamun

Lyricist: Joshua Shaik
Verse
కీర్తింతు నీ నామమున్
నా ప్రభువా… సన్నుతింతు నీ నామమున్‖ 2x ‖
మనసారా ఎల్లప్పుడు క్రొత్త గీతముతో‖ 2x ‖
నిను నే కొనియాడెదన్‖ 4x కీర్తింతు ‖
Verse
ప్రతి ఉదయం నీ స్తుతి గానం
దినమంతయు నీ ధ్యానం‖ 2x ‖
ప్రతి కార్యం నీ మహిమార్ధం‖ 2x ‖
సంధ్య వేళలో నీ స్తోత్ర గీతం‖ 2x కీర్తింతు ‖
Verse
నీవు చేసిన మేలులన్ లెక్కిస్తూ
వేలాది స్తుతులన్ చెల్లిస్తూ‖ 2x ‖
ఎనలేని నీ ప్రేమను వర్ణిస్తూ‖ 2x ‖
నిన్నే నేను ఆరాధిస్తూ‖ 2x కీర్తింతు ‖
Verse
అమూల్యమైనది నీ నామం
ఇలలో శ్రేష్టమైనది నీ నామం‖ 2x ‖
ఉన్నతమైనది నీ నామం‖ 2x ‖
నాకై నిలచిన మోక్ష మార్గం‖ 2x కీర్తింతు ‖

Related Tags

PraiseWorshipThanksgiving