Verse
కీర్తింతును నీ నామము
మనసారా యేసయ్యా‖ 2x ‖
మదిలో ధ్యానించి‖ 2x ‖
తరియింతు నేనయ్యా.. నా యేసయ్యా‖ కీర్తింతును ‖
Verse
ఏలేశమైన కరుణకు
ఈ దోషి పాత్రమా‖ 2x ‖
కల్వరిలో కృప చూపి
కలుషాలు బాపిన.. నా యేసయ్యా‖ కీర్తింతును ‖
Verse
వేనోళ్ళతోను పొగిడినా
నీ ఋణము తీరునా‖ 2x ‖
ఇన్నాళ్లు కన్నీళ్లు‖ 2x ‖
తుడిచావు జాలితో.. నా యేసయ్యా‖ కీర్తింతును ‖
Verse
జీవింతు నేను నీ కొరకే
నీ సాక్షిగా ఇలలో‖ 2x ‖
సేవించి పూజింతు‖ 2x ‖
నీ పాద సన్నిధిలో.. నా యేసయ్యా‖ కీర్తింతును ‖