Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Khandimpavalenu Durgunamulu Khandimpa

ఖండింపవలెను దుర్గుణములు ఖండింప

Khandimpavalenu Durgunamulu Khandimpa

Chorus
ఖండింపవలెను దుర్గుణములు ఖండింపవలెను ఖండింపవలెఁ బాప
ముండఁజూచి యేసు నండఁజేరి మన గుండె పదిలముఁ జేసి‖ ఖండింప ‖
Verse
అంధత్వమునను రక్షణమార్గ మందుఁ జేరకయు ఎందెందుఁ జూ
చిన సందులేక పాప మందు మునిఁగి నరలా నందమోందక చెడిరి‖ ఖండింప ‖
Verse
ఎందు కీ భ్రమలు నీ యందుండు సందేహము వీడు పొందుగ
యేసు సం బంధు డవై యున్న నందమైన మోక్ష మందుఁ జేరుట కొఱకు‖ ఖండింప ‖
Verse
బెదరక నీవు సాతానుని నెదిరింపవలెను కుదురుగ నీ యేసు
చదరునఁ జేరిన వదరుబోతు లెల్ల నెదురాడ లేరిఁక‖ ఖండింప ‖
Verse
ఆసింపబోకు లోకభోగములు మోసమై యుండు వాసిగ యేసుని
దాసుఁడవైయున్న గాసిఁ జెందక మోక్ష దాసుఁడ వౌదువు‖ ఖండింప ‖
Verse
నమ్మి జీవించు యేసుని యందు నెమ్మదిఁ బొందు రమ్ము యేసుని
యొద్ద సొమ్ము నీకున్నది సమ్మతించి మదిని నెమ్మదిగాఁ జూచి‖ ఖండింప ‖

Related Tags

HolinessRepentanceSalvation