Verse
కొడవలిని చేత పట్టి కోత కోయుము
తెల్లబారిన పొలములన్నియు‖ 2x ‖
నశియించు ఆత్మల భారము కలిగి
ఆగక సాగుమా ప్రభు సేవలో‖ కొడవలిని ‖
Verse
సర్వ సృష్టికి సువార్త ప్రకటన
ప్రభువు మనకిచ్చ్చిన భారమే కదా‖ 2x ‖
ఎన్నడూ దున్నని భూములను చూడు‖ 2x ‖
కన్న తండ్రి యేసుని కాడిని మోయు‖ 2x కొడవలిని ‖
Verse
పిలిచిన వాడు నమ్మదగినవాడు
విడువడు నిన్ను ఎడబాయడు‖ 2x ‖
అరచేతులతో నిన్ను చెక్కుకున్నవాడు‖ 2x ‖
అనుక్షణము నిన్ను కాయుచున్నవాడు‖ 2x కొడవలిని ‖