Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kolaahalamuga Goorimithoa Goodi Kola

కోలాహలముగఁ గూరిమితోఁ గూడి కోలా

Kolaahalamuga Goorimithoa Goodi Kola

Lyricist: Mikkili Namuyelu
Chorus
కోలాహలముగఁ గూరిమితోఁ గూడి కోలాటమాడను రా రా మా
పాలిటి యేసుని పేరఁ మాపాలిటి యేసుని పేర మ మ్మేలెడి దేవుని
పేరఁ‖ కోలాహలముగ ‖
Verse
మా సామి యా మోక్ష వాసుండు నైనట్టి యేసయ్య పోకను జూడు
మా యేసయ్యరాకను బాడు యేసయ్య రాకను బాడు నీ హోసన్న యని
మదివేడు‖ కోలాహలముగ ‖
Verse
పాపంబులన్ మోసి ప్రాణంబు బలి యిచ్చి తాఁ బరమున కేగలేదా
నీ జ్ఞాపకములోనికి రాదా జ్ఞాపకములోనికి రాదా నీ ప్రాపకుఁడై
యుండలేదా‖ కోలాహలముగ ‖
Verse
ఏలినవాడైన యేసుని రాకను నాలించి చూడవదేర నిను పాలించు
వాడనుకోర పాలించువాడనుకోర పరి శీలించువాడనుకోర‖ కోలాహలముగ ‖
Verse
అంతములో భువి కా యేసునాధుండు చెంతను దూతలతోడ బల్
వింతగ వచ్చును జూడ వింతగ వచ్చును జూడ న త్యంత బలముతోడ
రాఁడ‖ కోలాహలముగ ‖
Verse
ఆకాశ భూమ్యాదు లార్భటిలు దూతల మూకలతోఁ గూడినాఁడు ఈ
లోకాని కేతెంచుఁవాడు లోకాని కేతెంచువాఁడు ఇఁక వీకతోఁ బ్రభుని
బాడు‖ కోలాహలముగ ‖
Verse
భీకర సింహపు టాకారముతోను ఢీకొని మేఘములతోడ బల్
బాకారవంబులు బాడ బాకారంబులు బాడ నిటు ఢీకొని వచ్చెను
జూడ‖ కోలాహలముగ ‖
Verse
భాసురమైనట్టి యేసయ్య రాకను ఈ సూర్యుఁడు జూడలేఁడు తన వి
కాసము జీఁకటౌను వి కాసము జీఁకటౌను నీ కా సుగతిఁ జూపువాఁడు‖ కోలాహలముగ ‖

Related Tags

PraiseWorshipSecond Coming